తూర్పు నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
1.
56వ డివిజన్ కార్పొరేటర్ అయిశేట్టి కనకదుర్గ (మార్కెట్ శ్రీను) ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఊరూ వాడా ఒక్కటై. బంధు మిత్రులు ఏకమై. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు..